Saturday 25 May 2019

శ్రీ సత్య నారాయణుని సేవకు రారమ్మా పాట





శ్రీ సత్య  నారాయణుని సేవకు రారమ్మా పాట

పల్లవి:
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా                
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ
నోచిన వారికి నోచిన వరము
చూసినవారికి చూసిన ఫలము
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ

చరణం1:
స్వామిని పూజించే చేతులే చేతులట
ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట
స్వామిని పూజించే చేతులే చేతులట
ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట
తన కథవింటే ఎవ్వరికైనా జన్మతరించునట
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ

చరణం2:
ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచేదైవం ఈ దైవం
ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచేదైవం ఈ దైవం
అన్నవరంలొ వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ

చరణం3:
అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా
స్వామికి మదిలోనే కోవెల కడదామా
అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా
స్వామికి మదిలోనే కోవెల కడదామా
పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ

చరణం4:
మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా
కరములు జోడించి శ్రీ చందన మలరించి
మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా
కరములు జోడించి శ్రీ చందన మలరించి
మంగళమనరే సుందరమూర్తికి వందనమనరమ్మా

శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ



Friday 24 May 2019

సత్యనారాయణ స్వామి హారతి పాట




సత్యనారాయణ స్వామి  హారతి  పాట



మంగళ హరతి గైకోను మా
 సత్యనారాయణ హారతి దె  || 2||

భక్త జనావన  -  పరమాత్మ  
ముక్తి ప్రదాత -  సత్య దేవా || మంగళ ||                                         ||1||


మంగళ మోయి మమతనుబాపి సత్యనారాయణ హారతి దె 

పంపా నది తీరమునా 
అన్నవరము నందు వెలసితివి || 2||

పిలిచిన దేవా - పలికిన దేవా
సత్యనారాయణ హారతి దె  || మంగళ ||                                            ||2||
     

మంగళ మోయి మమతనుబాపి సత్యనారాయణ హారతి దె 

పిలిచిన పలికె  స్వామి  వట 
అడిగిన వరములు ఇస్తు వటా|| 2||                                                   ||3||

మంగళ మోయి మమతనుబాపి సత్యనారాయణ హారతి దె  || మంగళ ||   


మంగళ మోయి మమతనుబాపి సత్యనారాయణ హారతి దె  

మంగళ హరతి గైకోను మా సత్యనారాయణ హారతి దె                           ||4||





మణిద్వీప వర్ణన



మణిద్వీప వర్ణన


మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని
మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువైయుంది|| 1||

సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు
అచంచలంబగు మనోసుఖాలు మణి ద్వీపానికి మహానిధులు|| 2||

లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు
లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహనిధులు|| 3||

పారిజాత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలు
గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు|| 4||

                
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
                 
దేవదేవుల నివాసము అదియే కైవల్యం||


పద్మరాగములు సువర్ణమణులు పదిఆమడల పొడవున గలవు
మధుర మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు|| 5||

అరువది నాలుగు కళామతల్లులు వరాలనొసగే పదారుశక్తులు
పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు|| 6||

అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కులూ దిక్పాలకులు
సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు||7||

కోటి సూర్యులు ప్రచండకాంతులు కోటిచంద్రుల చల్లని వెలుగులు
కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు|| 8||

                 
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
                 
దేవదేవుల నివాసము అదియే కైవల్యం||


కంచుగోడల ప్రాకారాలు రాగిగోదల చతురస్రాలు
ఏడామడల రత్నరాసులు మణి ద్వీపానికి మహానిధులు|| 9||

పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు
ప్రపంచమేలే ప్రజాధిపతులు మణి ద్వీపానికి మహానిధులు|| 10||

ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైఢూర్యాలు
పుష్పరాగమణి ప్రాకారాలు మణి ద్వీపానికి మహానిధులు|| 11||

సప్తకోటి ఘన మంత్రవిద్యలు సర్వశుభప్రద ఇచ్చాశక్తులు
శ్రీగాయత్రీ జ్నానశక్తులు మణి ద్వీపానికి మహానిధులు|| 12||

                
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
                 
దేవదేవుల నివాసము అదియే కైవల్యం||


మిలమిలలాడే ముత్యపురాసులు తళతళలాడే చంద్రకాంతములు
విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు|| 13||

కుబేర ఇంద్ర వరుణదేవుల శుభాలనొసగే అగ్నివాయువులు
భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు|| 14||

భక్తిజ్నాన వైరాగ్యసిద్దులు పంచభూతములు పంచశక్తులు
సప్తఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు|| 15||

కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలమహాగ్రహాలు
ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిదులు|| 16||

                
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
                 
దేవదేవుల నివాసము అదియే కైవల్యం||


మంత్రిణి దండిని శక్తిసేవలు కాళికరాళి సేనాపతులు
ముప్పది రెందు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు|| 17||

సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు
గోమేధికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు|| 18||

సప్తసముద్రము లనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు
నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు|| 19||

మానవ మాధవ దేవగనములు కామధేనువు కల్పతరువులు
సృష్టిస్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు|| 20||

                
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
                 
దేవదేవుల నివాసము అదియే కైవల్యం||


కోటి ప్రకృతుల సౌందర్యాలు సకలవెదములు ఉపనిషత్తులు
పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు|| 21||

దివ్య ఫలముల దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు
దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు|| 22||

శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్నానముక్తి ఏకాంత భవనములు
మణి నిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు|| 23||

పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేకశక్తులు
సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు|| 24||

చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు
వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు|| 25||

ధుఃఖము తెలియని దేవీసేనలు నటనాట్యాలు సంగీతాలు
ధనకనకాలు పురుషార్ధాలు మణిద్వీపానికి మహానిధులు|| 26||

పదునాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు
సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వతస్థానం || 27||

చింతమణుల మందిరమందు పంచబ్రహ్మల మంచముపైన
మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో|| 28||

                
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
                 
దేవదేవుల నివాసము అదియే కైవల్యం||


మణిగణ ఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి
సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో|| 29||

పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో
అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది||2|| ||30 ||

నూతన గృహములు కట్టినవారు మణిద్వీప వర్ణన తొమ్మిదిసార్లు
చదివిన చాలు అంతా శుభమే అష్టసంపదల తులతూగేరు||2|| || 31||

శివకవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివినచోట
తిష్ట వేసుకొని కూర్చొనునంటా కోటి శుభాలను సమకూర్చకొనుటకై||2||  ||32||

                
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
                 
దేవదేవుల నివాసము అదియే కైవల్యం||




మంగళహారతి


శ్రీ  త్రిపురసుందరికి  మణిద్వీపవాసినికి !

మంగళమ్  జయమంగళమ్  నిత్య  శుభమంగళమ్   !!

ఓంకార  రూపిణికి  హ్రీంకార వాసినికి  శ్రీం ,బీజవాహినికి

మంగళమ్  జయమంగళమ్  నిత్య శుభమంగళమ్  !!

ఆపదలు  బాపేటి  సంపదలనొసగేటి  శ్రీనగరవాసినికి  !

మంగళమ్  జయమంగళమ్  నిత్య  శుభమంగళమ్ !!

వేదాలు  నాదాలు  శిరసొంచి  మొక్కేటి శ్రీ రత్నసింహాసినికి !

మంగళమ్ జయమంగళమ్ నిత్య  శుభమంగళమ్ !!


అచ్యుతం కేశవం సాయి దామేదరం సాయి పాట

అచ్యుతం   కేశవం   సాయి   దామేదరం సాయి   పాట       పల్లవి : అచ్యుతం  కేశవం  సాయి  దామేదరం ll2ll             భక్తజనవ...