Monday 24 December 2018

పార్వతీ పరమేశ్వర కళ్యాణం పాట





పార్వతీ పరమేశ్వర కళ్యాణం పాట


పల్లవి:  పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం
           కనువిందు ఆయినే ఈలోకం భూలోకం ll2ll
పిల్లలారా పెద్దలార ముక్కోటి దేవతలారా చూడగారారండి తనివితీరా

అను పల్లవి : శివపార్వతికళ్యాణం లోకాలకుశుభకార్యం ll 2 ll

చరణం 1: పెద్ద గ్రామ దేవతోచ్చి పారాణిదిద్దింది ll 2 ll
               చిన్న గ్రామ దేవతోచ్చి చీర సారెయిచ్చింది ll 2 ll

చరణం 2: భుదేవి కదలివచ్చి బాసికం కట్టింది ll 2 ll
              నెలపోడుపున చంద్రడు వచ్చి తిలకంగా మారాడు ll 2 ll

చరణం 3: ఆరుద్ర చుక్క వచ్చి బుగ్గనచుక్కైనది ll 2 ll
              ప్రకృతె పరవసించి పూదండగా మారినది ll 2 ll

చరణం 4: మాంగల్యం  తంతునానేనా  మామ  జీవన  హేతునా
              కంటె  బధ్నాని  శుభయే  త్వాం జీవన శారణాం  శాతం

              పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం 
             కనువిందు ఆయినే ఈలోకం భూలోకం ll2ll

చరణం 5:  కోరి కోరి తెచ్చుకున్న వరుడే ఈశ్వరుడు ll 2 ll
               ఏన్నటికి ఈబంధం వీడిపోనెపోదు ll 2 ll

చరణం 6: సూర్యుడే దిగివచ్చి అగ్నిగుండమయ్యాడు ll 2 ll
              ఆకాశం తరాలన్ని తలంబ్రాలుగా మారెను ll 2 ll

చరణం 7: మేఘలు ఉరుములు ధ్వని మేళతాళలమాయెను ll 2 ll
             మగవాడిలో సగభాగము ఇల్లాలికి అంకితం 
             ఈసత్యమె తెలిపేది అర్ధనారీశ్వరం ll2ll

           పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం 
           కనువిందు ఆయినే ఈలోకం భూలోకం ll2ll
           పిల్లలారా పెద్దలార ముక్కోటి దేవతలారా చూడగారారండి తనివితీరా
          శివపార్వతికళ్యాణం లోకాలకుశుభకార్యం ll 2 ll

చరణం 8:  చూడలేని కళ్ళు పాపిష్ఠి కళ్ళు ll 2 ll
               చూసే ఈ కళ్ళు పుణ్యాత్ముల కళ్ళు ll 2 ll

             పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం 
             కనువిందు ఆయినే ఈలోకం భూలోకం ll2ll


No comments:

Post a Comment

అచ్యుతం కేశవం సాయి దామేదరం సాయి పాట

అచ్యుతం   కేశవం   సాయి   దామేదరం సాయి   పాట       పల్లవి : అచ్యుతం  కేశవం  సాయి  దామేదరం ll2ll             భక్తజనవ...