Saturday 22 December 2018

శివుడు తాండవము పాట




శివుడు తాండవము పాట


పల్లవి :
శివుడు తాండవము సేయునమ్మ. కైలాసగిరిలో
శివుడు తాండవము సేయునమ్మ కైలాసగిరిలో
శివుడు తాండవము సేయునమ్మా కైలాసగిరిలో
అను పల్లవి :
శివుడు తాండవము సేయును నిత్యము.....  అవిరళముగ జగదాంబ ముందర ll2ll
శివుడు తాండవము సేయునమ్మా కైలాసగిరిలో

చరణం 1:
భారతి వీణచే శృతి పల్క లయ తప్పకుండా బ్రహ్మ  దేవుడే తాళము వేయ ll2ll
సారస గతులను సప్త తాళముల భావము పుట్టగ ప్రదోష వేళల ll2ll

శివుడు తాండవము సేయునమ్మ కైలాస గిరిలో
శివుడు తాండవము సేయునమ్మ కైలాస గిరిలో

చరణం 2:
మురళి దేవేంద్రుడె పూరింప  నారాయణ మూర్తి మురియుచు మద్దెల వాయింప ll2ll
ధిమి ధిమి  తాధిమి ధిమి ధిమి  అనుచును భరత శాస్త్రమును పలికిన రీతిగ ll2ll

శివుడు తాండవము సేయునమ్మ కైలాస గిరిలో
శివుడు తాండవము సేయునమ్మ కైలాస గిరిలో
శివుడు తాండవము సేయునమ్మ కైలాస గిరిలో

No comments:

Post a Comment

అచ్యుతం కేశవం సాయి దామేదరం సాయి పాట

అచ్యుతం   కేశవం   సాయి   దామేదరం సాయి   పాట       పల్లవి : అచ్యుతం  కేశవం  సాయి  దామేదరం ll2ll             భక్తజనవ...