మహాశక్తి
మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని
మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువైయుంది|| 1||
మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువైయుంది|| 1||
సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు
అచంచలంబగు మనోసుఖాలు మణి ద్వీపానికి మహానిధులు|| 2||
లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు
లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహనిధులు|| 3||
పారిజాత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలు
గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు|| 4||
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం||
పద్మరాగములు
సువర్ణమణులు పదిఆమడల పొడవున గలవు
మధుర మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు|| 5||
మధుర మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు|| 5||
అరువది నాలుగు కళామతల్లులు వరాలనొసగే పదారుశక్తులు
పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు|| 6||
అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కులూ దిక్పాలకులు
సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు||7||
కోటి సూర్యులు ప్రచండకాంతులు కోటిచంద్రుల చల్లని వెలుగులు
కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు|| 8||
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం||
కంచుగోడల
ప్రాకారాలు రాగిగోదల చతురస్రాలు
ఏడామడల రత్నరాసులు మణి ద్వీపానికి మహానిధులు|| 9||
ఏడామడల రత్నరాసులు మణి ద్వీపానికి మహానిధులు|| 9||
పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు
ప్రపంచమేలే ప్రజాధిపతులు మణి ద్వీపానికి మహానిధులు|| 10||
ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైఢూర్యాలు
పుష్పరాగమణి ప్రాకారాలు మణి ద్వీపానికి మహానిధులు|| 11||
సప్తకోటి ఘన మంత్రవిద్యలు సర్వశుభప్రద ఇచ్చాశక్తులు
శ్రీగాయత్రీ జ్నానశక్తులు మణి ద్వీపానికి మహానిధులు|| 12||
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం||
మిలమిలలాడే
ముత్యపురాసులు తళతళలాడే చంద్రకాంతములు
విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు|| 13||
విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు|| 13||
కుబేర ఇంద్ర వరుణదేవుల శుభాలనొసగే అగ్నివాయువులు
భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు|| 14||
భక్తిజ్నాన వైరాగ్యసిద్దులు పంచభూతములు పంచశక్తులు
సప్తఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు|| 15||
కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలమహాగ్రహాలు
ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిదులు|| 16||
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం||
మంత్రిణి
దండిని శక్తిసేవలు కాళికరాళి సేనాపతులు
ముప్పది రెందు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు|| 17||
ముప్పది రెందు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు|| 17||
సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు
గోమేధికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు|| 18||
సప్తసముద్రము లనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు
నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు|| 19||
మానవ మాధవ దేవగనములు కామధేనువు కల్పతరువులు
సృష్టిస్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు|| 20||
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం||
కోటి
ప్రకృతుల సౌందర్యాలు సకలవెదములు ఉపనిషత్తులు
పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు|| 21||
పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు|| 21||
దివ్య ఫలముల దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు
దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు|| 22||
శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్నానముక్తి ఏకాంత భవనములు
మణి నిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు|| 23||
పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేకశక్తులు
సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు|| 24||
చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు
వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు|| 25||
ధుఃఖము తెలియని దేవీసేనలు నటనాట్యాలు సంగీతాలు
ధనకనకాలు పురుషార్ధాలు మణిద్వీపానికి మహానిధులు|| 26||
పదునాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు
సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వతస్థానం || 27||
చింతమణుల మందిరమందు పంచబ్రహ్మల మంచముపైన
మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో|| 28||
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం||
మణిగణ
ఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి
సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో|| 29||
సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో|| 29||
పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో
అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది||2|| ||30 ||
నూతన గృహములు కట్టినవారు మణిద్వీప వర్ణన తొమ్మిదిసార్లు
చదివిన చాలు అంతా శుభమే అష్టసంపదల తులతూగేరు||2|| || 31||
శివకవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివినచోట
తిష్ట వేసుకొని కూర్చొనునంటా కోటి శుభాలను సమకూర్చకొనుటకై||2|| ||32||
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం||
మంగళహారతి
శ్రీ త్రిపురసుందరికి మణిద్వీపవాసినికి
!
మంగళమ్ జయమంగళమ్ నిత్య శుభమంగళమ్ !!
ఓంకార రూపిణికి హ్రీంకార
వాసినికి శ్రీం ,బీజవాహినికి
మంగళమ్ జయమంగళమ్ నిత్య
శుభమంగళమ్ !!
ఆపదలు బాపేటి సంపదలనొసగేటి శ్రీనగరవాసినికి !
మంగళమ్ జయమంగళమ్ నిత్య శుభమంగళమ్
!!
వేదాలు నాదాలు శిరసొంచి మొక్కేటి
శ్రీ రత్నసింహాసినికి !
మంగళమ్
జయమంగళమ్ నిత్య శుభమంగళమ్ !!
No comments:
Post a Comment