Wednesday 21 August 2019

శాంతి మంత్రములు







శాంతి మంత్రములు
        1.పరమం పవిత్రం బాబా విభూతిం
పరమం పచిత్రంలీలా విభూతిం
పరమార్ద  మిప్టార్ద మోక్షప్రదాతం
బాబా విభూతిం ఇదమాశ్రయామి ||

2.నీ పాదకమల సేవయు
నీ పాదార్చకుల తోడి నెయ్యమును
నితాంతాపార భూతదయయును
తాపసమందార నాకుదయసేయగదే

3.త్వమేవ మాతాచ పితా త్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మమదేవ దేవ||

4.ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు
ప్రాణిషు సద్బావ నాస్తు విశ్వస్య కల్యాణమస్తు 

5.ఓం అసతోమాసద్గమయ
ఓం తమసోమా జ్యోతిర్గమయ
ఓం మృత్యోర్మా అమృతంగమయ

ఓం శాంతి శ్శాంతి శ్శాంతి శ్శాంతి శ్శాంతి శ్శాంతి :హరి : ఓం తత్ సత్


            సమర్ద సద్గురువు  సాయినాధ్ మహరాజ్ కి జై

శ్రీ సాయి నక్షత్ర మాలిక







శ్రీ సాయి నక్షత్ర మాలిక

1.  షిర్డీ సదనా శ్రీ సాయీ
సుందర వదన శుభ దాయీ
జగత్కారణా జయ సాయీ
నీ స్మరణే ఎంతో హాయీ

2.  శిరమున వస్త్రము చుట్టితివీ
చినిగిన కఫనీ తొడిగితివీ
పకీరువలె కనిపించితివీ
పరమాత్ముడవనిపించితివీ

 3.     చాందుపటేలుని పిలిచితివవీ
అశ్వము జాడ తెలిపితివి
మహల్సా భక్తికి మురుసితివీ
సాయని పిలిచితే పలికితివీ

4.     గోధుమ పిండిని విసరితివవీ
కలరా వ్యాధిని తరిమితివీ
తుఫాను తాకిడినాపితివీ
అపాయమును తప్పించితివీ

5.     అయిదిళ్ళలో బిక్షడిగితివీ
పాపాలను పరిమార్చితివీ
బైజా సేవను మెచ్చితివీ
సాయుజ్యమునూ ఇచ్చితివీ

6.     నీళ్ళను నూనెగా మర్చితివీ
దీపాలను వెలిగించితివీ
సూకర నైజం తెలిపితివీ
నిందలు వేయుట మాన్పితివీ

7.     ఊదీ  వైద్యం చేసితివీ
వ్యాధుల నెన్నో బాపితివీ
సంకీర్తన చేయించితివీ
చిత్త శాంతి చేకుర్చితివీ

8.     అల్లా నామము పలికితివీ
ఎల్లరి క్షేమము కోరితివీ
చందనోత్సవం చేసితివీ
మతద్వేషాలను మాపితివీ

9.     కుష్టు రోగిని గాంచితివీ
ఆశ్రయమిచ్చి సాకితివీ
మనవ ధర్మం నెరపితివీ
మహాత్మునిగా విలసిల్లితివీ

10.   ధునిలో చేతిని పెట్టితివీ
కమ్మరి బిడ్డను కాచితివీ
శ్యామా మొర నాలించితివీ
పాము విషము తొలగించితివీ

11.    జానెడు బల్లను ఎక్కితివీ
చిత్రముగా శయనించితివీ
బల్లి రాకనూ తెలిపితివీ
సర్వజ్ఞుడవనిపించితివీ

12.  లెండీ వనమును పెంచితివీ
ఆహ్లాదమును పంచితివీ
కర్తవ్యము నెరిగించితివీ
సోమరితనమును తరిమితివీ

13.  కుక్కను కొడితే నొచ్చితివీ
నీపై దెబ్బలు చూపితివీ
ప్రేమ తత్వమును చాటితివీ
దయామయుడవనిపించితివీ

14. అందరిలోనూ ఒదిగితివీ
ఆకాశానికి ఎదిగితివీ
దుష్ట జనాళిని మార్చితివీ
శిష్ట కోటిలో చెర్చితివీ

15.   మహల్సా ఒడిలోకొరిగితివీ
ప్రాణాలను విదనాడితివీ
మూడు దినములకు లేచితివీ
మృత్యుంజయుడనిపించితివీ

16.   కాళ్ళకు గజ్జెలు కట్టితివీ
లయ బద్దముగా ఆడితివీ
మధుర గళముతో పాడితివీ
మహాదానందము కూర్చితివీ

17.   అహంకారమును తెగడితివీ
నానావలినీ పొగడితివీ
మానవ సేవ చేసితివీ
మహనీయుడవనిపించితివీ

18.  దాము భక్తికి మెచ్చితివీ
సంతానమును ఇచ్చితివీ
దాసగణుని కరుణించితివీ
గంగా యమునలు చూపితివీ

19.   పరిప్రశ్నను వివరించితివీ
నానాహృది కదిలించితివీ
దీక్షితుని పరీక్షించితివీ
గురు భక్తిని ఇల చాటితివీ

20.   చేతిని తెడ్డుగాతిప్పితివీ
కమ్మని వంటలు చేసితివీ
ఆర్తజనాళిని పిలిచితివీ
ఆకలి బాధను తీర్చితివీ

21.  మతమును మార్చితే కసరితివీ
మతమే తండ్రని తెలిపితివీ
సకల భూతదయ చూపితివీ
సాయి మాతగా అలరితివీ

22.   హేమాదును  దీవించితివీ
నీదు చరిత వ్రాయించితివీ
పారాయణ చేయించితివీ
పరితాపమునెడబాపితివీ

23.  లక్ష్మీబాయిని పిలిచితివవీ
తొమ్మిది నాణేములిచ్చితివీ
నవవిధ భక్తిని తెలిపితివీ
ముక్తికి మార్గం చూపితివీ

24. బూటీ కలలోకొచ్చితివీ
ఆలయమును కట్టించితివీ
తాత్యా ప్రాణమును నిలిపితివీ
మహాసమాధీ చెందితివీ

25.   సమాధి నుండే పలికితివీ
హారతినిమ్మని అడిగితివి
మురళీధరునిగ నిలిచితివీ
కరుణామృతమును చిలికితివీ

26. చెప్పినదేదో చేసితివీ
చేసినదేదో చెప్పితివీ
దాసకోటిమది దోచితివీ
దశదిశలా భాసిల్లితివీ

27. సకల దేవతలు నీవెనయా
సకల శుభములను కూర్చుమయా
సతతము నిను ద్యానింతుమయా
సద్గురు మాహృది నిలువుమయా

సాయి నక్షత్ర మాలికా  భవ రోగాలకు మూలికా పారాయణకిది తేలికా  ఫలమిచ్చుటలో ఏలికా
సమర్ద సద్గురువు  సాయినాధ్ మహరాజ్ కి జై

శ్రీ షిరిడీ సాయిబాబా ఏకాదశ సూత్రములు







శ్రీ షిరిడీ సాయిబాబా ఏకాదశ సూత్రములు

1. షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖపరిహారము.
2. ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి, ద్వారకామాయి ప్రవేశమొనరించునంతనే సుఖసంపదలొందగలరు.
3. ఈ భౌతిక దేహానంతరము సైతము నే నప్రమత్తుడనే.
4. నా భక్తులకు రక్షణము నా సమాధినుండియే వెలువడును.
5. సమాధినుండియే నేను సర్వకార్యములు నిర్వహింతును.
6. నా సమాధానుండి నా మానుష శరీరము మాటలాడును.
7. నన్నాశ్రయించువానిని, నన్ను శరణు జొచ్చినవానిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యము.
8. నాయందెవరి దృష్టి గలదో, వారియందే నాయొక్క కటాక్షము కలదు.
9. మీ భారములను నాపై బడవేయుడు; నేను మోసెదను.
10. నా సహాయమును గాని, సలహాను గాని కోరినచో తత్ క్షణమే యొసంగెదను.
11. నా భక్తుల గృహములయందు "లేమి" యను శబ్దము పొడసూపదు.

Tuesday 20 August 2019

శ్రీ మహాలక్ష్మి అష్టకం






శ్రీ మహాలక్ష్మి అష్టకం
ఇంద్ర ఉవాచ - 

నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే || 1 ||

నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే || 2 ||

సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి |
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే || 3 ||

సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని |
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే || 4 ||

ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి |
యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే || 5 ||

స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే || 6 ||

పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి |
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే || 7 ||

శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే |
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే || 8 ||

మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||

ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం |
ద్వికాలం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ||

త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం |
మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ||


ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణమ్

అచ్యుతం కేశవం సాయి దామేదరం సాయి పాట

అచ్యుతం   కేశవం   సాయి   దామేదరం సాయి   పాట       పల్లవి : అచ్యుతం  కేశవం  సాయి  దామేదరం ll2ll             భక్తజనవ...