Thursday 27 December 2018

ఓం నమో భాగవతే వాసుదేవాయ పాట



ఓం నమో భాగవతే వాసుదేవాయ పాట



పల్లవి : ఓం నమో భాగవతే వాసుదేవాయ
           ఓం నమో భాగవతే వాసుదేవాయ ll2ll

చరణం 1: 
              పుట్టింది మధురయందు – పెరిగింది గోకులంలో
              కడుపు తీపి దేవకికా ? అనురాగం యశోదకా ?
              ఏమిటో  నీ  మాయ  నటన  సూత్రధారి
              జగత్కర్త – జగద్రక్ష - జగదోద్దారా    ll ఓం నమో ll
చరణం 2: 
              బాలచేష్టలు నెఱసినావు – భూరిజ్ఞన మోసగినావు
              భారమెంతో మోసినావు  –  గోవర్ధన మెత్తినావు
              ఏమిటో  నీ  మాయ  నటన  సూత్రధారి
              జగత్కర్త – జగద్రక్ష - జగదోద్దారా    ll ఓం నమో ll
చరణం 3: 
             పట్టమహిషి రుక్మిణియా ? ప్రేమమూర్తి రాధయా?
             శృంగార సార్వభౌమ ? సింగారం సత్యతోనా?
             ఏమిటో  నీ  మాయ  నటన  సూత్రధారి
             జగత్కర్త – జగద్రక్ష - జగదోద్దారా    ll ఓం నమో ll
చరణం 4: 
             రణరంగ తుల్యమైన జీవితములుద్ధరింప
            పార్దునిపై నెపమువేసి గీతనే ఇచ్చినావు
            ఏమిటో  నీ  మాయ  నటన  సూత్రధారి
           జగత్కర్త – జగద్రక్ష  - జగదోద్దారా    ll ఓం నమో ll

శ్రీ గోదాదేవి కళ్యాణం పాట



శ్రీ గోదాదేవి కళ్యాణం పాట

పల్లవి :  రంగ రంగ వైభోగమే  శ్రీ గోదాదేవి కళ్యాణ వైభోగమే ll రంగ ll

చరణం 1:  శ్రీ విల్లిపుత్తూరు విష్ణు చిత్తుల పుత్రిక
               గోదాదేవి కళ్యాణం చూడ కన్నులు చాలవుగా ll శ్రీ రంగ ll
చరణం 2: మున్ముందు గోదాదేవి ధరియించి ఇచ్చినట్టి
              మాలపై మరులుగొని పత్నిగాఁతా గోరె            ll శ్రీ రంగ ll
చరణం 3: ముక్కోటి దేవతల కోర్కెలను కోరక దీర్చె
              శ్రీ రంగనాధుడే గోదాదేవినే కోరెనండి               ll శ్రీ రంగ ll
చరణం 4:నూటెనిమిది కలశాల పాయసం మ్రొక్కుపెట్ట
              పెనవేసిన ప్రేమతో శ్రీ రంగడే కాచెనండి             ll శ్రీ రంగ ll
చరణం 5: శ్రీ రంగనాధుడే తులసి మాల ధారుడై
             మురిపా గోదాదేవిని మురిపించ వచ్చెనండి         ll శ్రీ రంగ ll
చరణం 6: రాసక్రీడల రాయుడే శ్రీ రంగనాధుడై
             గోదాదేవిని పెండ్లాడంగ  పెండ్లి కొడుకై వచ్చెనండి   ll శ్రీ రంగ ll
చరణం 7: పూబోణి గోదాదేవిని శ్రీ రంగ పాణిగ్రహణం 
              తనివితీర తిలకించి తరియించ రారండి              ll శ్రీ రంగ ll





Monday 24 December 2018

పార్వతీ పరమేశ్వర కళ్యాణం పాట





పార్వతీ పరమేశ్వర కళ్యాణం పాట


పల్లవి:  పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం
           కనువిందు ఆయినే ఈలోకం భూలోకం ll2ll
పిల్లలారా పెద్దలార ముక్కోటి దేవతలారా చూడగారారండి తనివితీరా

అను పల్లవి : శివపార్వతికళ్యాణం లోకాలకుశుభకార్యం ll 2 ll

చరణం 1: పెద్ద గ్రామ దేవతోచ్చి పారాణిదిద్దింది ll 2 ll
               చిన్న గ్రామ దేవతోచ్చి చీర సారెయిచ్చింది ll 2 ll

చరణం 2: భుదేవి కదలివచ్చి బాసికం కట్టింది ll 2 ll
              నెలపోడుపున చంద్రడు వచ్చి తిలకంగా మారాడు ll 2 ll

చరణం 3: ఆరుద్ర చుక్క వచ్చి బుగ్గనచుక్కైనది ll 2 ll
              ప్రకృతె పరవసించి పూదండగా మారినది ll 2 ll

చరణం 4: మాంగల్యం  తంతునానేనా  మామ  జీవన  హేతునా
              కంటె  బధ్నాని  శుభయే  త్వాం జీవన శారణాం  శాతం

              పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం 
             కనువిందు ఆయినే ఈలోకం భూలోకం ll2ll

చరణం 5:  కోరి కోరి తెచ్చుకున్న వరుడే ఈశ్వరుడు ll 2 ll
               ఏన్నటికి ఈబంధం వీడిపోనెపోదు ll 2 ll

చరణం 6: సూర్యుడే దిగివచ్చి అగ్నిగుండమయ్యాడు ll 2 ll
              ఆకాశం తరాలన్ని తలంబ్రాలుగా మారెను ll 2 ll

చరణం 7: మేఘలు ఉరుములు ధ్వని మేళతాళలమాయెను ll 2 ll
             మగవాడిలో సగభాగము ఇల్లాలికి అంకితం 
             ఈసత్యమె తెలిపేది అర్ధనారీశ్వరం ll2ll

           పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం 
           కనువిందు ఆయినే ఈలోకం భూలోకం ll2ll
           పిల్లలారా పెద్దలార ముక్కోటి దేవతలారా చూడగారారండి తనివితీరా
          శివపార్వతికళ్యాణం లోకాలకుశుభకార్యం ll 2 ll

చరణం 8:  చూడలేని కళ్ళు పాపిష్ఠి కళ్ళు ll 2 ll
               చూసే ఈ కళ్ళు పుణ్యాత్ముల కళ్ళు ll 2 ll

             పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం 
             కనువిందు ఆయినే ఈలోకం భూలోకం ll2ll


Saturday 22 December 2018

శివుడు తాండవము పాట




శివుడు తాండవము పాట


పల్లవి :
శివుడు తాండవము సేయునమ్మ. కైలాసగిరిలో
శివుడు తాండవము సేయునమ్మ కైలాసగిరిలో
శివుడు తాండవము సేయునమ్మా కైలాసగిరిలో
అను పల్లవి :
శివుడు తాండవము సేయును నిత్యము.....  అవిరళముగ జగదాంబ ముందర ll2ll
శివుడు తాండవము సేయునమ్మా కైలాసగిరిలో

చరణం 1:
భారతి వీణచే శృతి పల్క లయ తప్పకుండా బ్రహ్మ  దేవుడే తాళము వేయ ll2ll
సారస గతులను సప్త తాళముల భావము పుట్టగ ప్రదోష వేళల ll2ll

శివుడు తాండవము సేయునమ్మ కైలాస గిరిలో
శివుడు తాండవము సేయునమ్మ కైలాస గిరిలో

చరణం 2:
మురళి దేవేంద్రుడె పూరింప  నారాయణ మూర్తి మురియుచు మద్దెల వాయింప ll2ll
ధిమి ధిమి  తాధిమి ధిమి ధిమి  అనుచును భరత శాస్త్రమును పలికిన రీతిగ ll2ll

శివుడు తాండవము సేయునమ్మ కైలాస గిరిలో
శివుడు తాండవము సేయునమ్మ కైలాస గిరిలో
శివుడు తాండవము సేయునమ్మ కైలాస గిరిలో

Tuesday 11 December 2018

దుర్గమ్మ పాట













దుర్గమ్మ పాట



అమ్మకిదేపూజ పాద పూజ దుర్గమ్మకిదే పూజ పాద పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ llఅమ్మll


1.కలకాలం అమ్మకిదే కనకాంబర పూజ 
   చేయి వదలరాదని చేమంతుల పూజ 
   దయతలిచే తల్లికిదే ధవనపు పూజ 
   మహమేరు నిలయినికి మందారల పూజ ll2ll llఅమ్మll


2.గుడిలోన తల్లికిదే గులాబీల పూజ 
   సకల రూప ధారిణికి సంపెంగల పూజ 
   మంగళదాయినికిదే మాలతీల పూజ
   భక్తుల బ్రోచేతల్లికి బంతిపూల పూజ ll2ll llఅమ్మll


3.లీలావినోదినికి లిల్లీపూల పూజ 
   కనువిందుల చేసేటి కమలాల పూజ 
   దిగివచ్చిన మాతకిదే దీపాల పూజ 
   జాలిగల తల్లికిదే జాజుల పూజ ll2ll llఅమ్మll






శివ కేశవల (రంగడు లింగడు) పాట










ధనుర్మాసం పాటలు

శివ కేశవల (రంగడు లింగడు) పాట


రంగడికి లింగడికి భేదమా అమ్మ రంగడికి లింగడకి భేదమా llరంగడికిll  ll2ll

1. ll అమ్మ ll వైకుంఠవాసుడమ్మ రంగడు ll2ll
       అమ్మ   కైలాశవాసుడమ్మ లింగడు ll2ll llరంగడికిll

2. ll అమ్మ ll నామాలు కలవాడు రంగడు ll2ll
      అమ్మ    అడ్డబొట్టు దారుడమ్మ లింగడు ll2ll llరంగడికిll

3.ll అమ్మ ll పట్టు వస్త్రదారుడమ్మ రంగడు ll2ll 
     అమ్మ    పులిచర్మదారుడమ్మ లింగడు ll2ll  llరంగడికిll

4.ll అమ్మ llశంఖచక్ర దారుడమ్మ రంగడు ll2ll
      అమ్మ   త్రిశూల దారుడమ్మ లింగడు ll2ll llరంగడికిll

5. ll అమ్మ llతులసిమాల దారుడమ్మ రంగడు ll2ll
       అమ్మ   రుద్రాక్ష లోలుడమ్మ లింగడు ll2ll llరంగడికిll

6. ll అమ్మ llసన్నజాజిపూలవాడు రంగడు ll2ll
      అమ్మ   తుమ్మిపూల  దారుడమ్మ లింగడు ll2ll llరంగడికిll

7.ll అమ్మ ll రుక్మిణి లోలుడమ్మ రంగడు ll2ll
      అమ్మ   పార్వతి లోలుడమ్మ లింగడు ll2ll llరంగడికిll

8. ll అమ్మ ll గరుడవాహన దారుడమ్మ రంగడు ll2ll
       అమ్మ   నందివాహన దారుడమ్మ లింగడు ll2ll llరంగడికిll

9. ll అమ్మ ll రంగడకి లింగడకి బేధమేలేదు ll2ll

       అమ్మ      శివకేశవలు ఒక్కటె నమ్మ  ll2ll 
       శివ కేశవల (రంగడు లింగడు) పాట వినండి

అచ్యుతం కేశవం సాయి దామేదరం సాయి పాట

అచ్యుతం   కేశవం   సాయి   దామేదరం సాయి   పాట       పల్లవి : అచ్యుతం  కేశవం  సాయి  దామేదరం ll2ll             భక్తజనవ...