Thursday 27 December 2018

శ్రీ గోదాదేవి కళ్యాణం పాట



శ్రీ గోదాదేవి కళ్యాణం పాట

పల్లవి :  రంగ రంగ వైభోగమే  శ్రీ గోదాదేవి కళ్యాణ వైభోగమే ll రంగ ll

చరణం 1:  శ్రీ విల్లిపుత్తూరు విష్ణు చిత్తుల పుత్రిక
               గోదాదేవి కళ్యాణం చూడ కన్నులు చాలవుగా ll శ్రీ రంగ ll
చరణం 2: మున్ముందు గోదాదేవి ధరియించి ఇచ్చినట్టి
              మాలపై మరులుగొని పత్నిగాఁతా గోరె            ll శ్రీ రంగ ll
చరణం 3: ముక్కోటి దేవతల కోర్కెలను కోరక దీర్చె
              శ్రీ రంగనాధుడే గోదాదేవినే కోరెనండి               ll శ్రీ రంగ ll
చరణం 4:నూటెనిమిది కలశాల పాయసం మ్రొక్కుపెట్ట
              పెనవేసిన ప్రేమతో శ్రీ రంగడే కాచెనండి             ll శ్రీ రంగ ll
చరణం 5: శ్రీ రంగనాధుడే తులసి మాల ధారుడై
             మురిపా గోదాదేవిని మురిపించ వచ్చెనండి         ll శ్రీ రంగ ll
చరణం 6: రాసక్రీడల రాయుడే శ్రీ రంగనాధుడై
             గోదాదేవిని పెండ్లాడంగ  పెండ్లి కొడుకై వచ్చెనండి   ll శ్రీ రంగ ll
చరణం 7: పూబోణి గోదాదేవిని శ్రీ రంగ పాణిగ్రహణం 
              తనివితీర తిలకించి తరియించ రారండి              ll శ్రీ రంగ ll





No comments:

Post a Comment

అచ్యుతం కేశవం సాయి దామేదరం సాయి పాట

అచ్యుతం   కేశవం   సాయి   దామేదరం సాయి   పాట       పల్లవి : అచ్యుతం  కేశవం  సాయి  దామేదరం ll2ll             భక్తజనవ...